27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఏప్రిల్ 16 (అఖండ భూమి న్యూస్);
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తలపెట్టిన ఏప్రిల్ 27 న *చలో వరంగల్* రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు గండ్ర మధుసూదన్ రావు , మాజీ ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్ అన్నారు. బుధవారం దోమకొండ
మండల కేంద్రంలోని పెఱిక సంఘంలో పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార వ్యామోహంతో ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని.తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పూర్తి అసహనంతో ఉన్నారని…… ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి పాలననే కోరుకుంటున్నారని అన్నారు. ఈ సభ ద్వారా గతంలో మాదిరిగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాల తప్పిదాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుండి బి ఆర్ ఎస్ ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి ఛైర్మెన్ కుంచాల శేఖర్, ముత్యంపేట్ సింగిల్ విండో ఛైర్మెన్ కొడిప్యాక తిరుపతి గౌడ్,మాజీ ఎంపీపీ కానుగంటి శారదా నాగరాజు,మాజీ ఎంపీటీసీ సభ్యులు కడారి రమేష్,మాజీ ఉప సర్పంచ్ గజవాడ శ్రీకాంత్,స్థానిక పట్టణ అధ్యక్షులు బోరెడ్డి కిషన్ రెడ్ది,పార్టీ సీనియర్ నాయకులు మండలంలోని అన్ని గ్రామాల పట్టణ అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



