కరెంటు కోతలతో లబోదిబోమంటున్న నాతవరం మండల ప్రజలు
నాతవరం మండలం లో కరెంటు కోతలతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇళ్లల్లో పేషెంట్లు ఉన్నారని గత కొన్ని రోజులుగా ఇష్టానుసారంగా కరెంటు కోతలు విధిస్తున్నారని దీనితో ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ చేస్తే ఎవరు స్పందించడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పేషంట్ల కోసమైనా ఈ కరెంటు కోతలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.