తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
వేసవి కాలం కావడంతో రక్తం దొరకక చిన్నారుల ఇబ్బందులు
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు..
కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ ల సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కూకట్ పల్లి లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ లు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ లు మాట్లాడుతూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో 400 మందికి పైగా చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని వేసవికాలం కావడంతో రక్త నిల్వలు తగ్గిపోవడం వలన 15 రోజులకు కావలసిన ఒక యూనిట్ రక్తం 30 రోజులు గడిచిన దొరకడం లేదని వీరిలో చాలామంది హైదరాబాద్, నిజామాబాద్ కి రక్త మార్పిడికి వెళ్లడం జరుగుతుందని వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం రక్తదాన శిబిరాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేస్తున్న రక్తదాతలకు పదివేల రూపాయల విలువైన జ్యూస్ బాటిల్లను అందజేస్తున్న ముస్త్యాల రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ గా కాపర్తి నాగరాజు,ముఖ్య అతిథులుగా శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీ,ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తా,కార్పొరేటర్ మాధవరం రోజా దేవి,యూత్ అధ్యక్షులు కట్ట రవి కుమార్ లు రావడం జరుగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు గంప ప్రసాద్,ఎర్రం చంద్రశేఖర్,వెంకటరమణ లు పాల్గొనడం జరిగింది.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…