బిజెపి శ్రేణులు గావ్ చలో.. బస్తీ చలో అభియాన్ సమావేశం..

 

బిజెపి శ్రేణులు గావ్ చలో.. బస్తీ చలో అభియాన్ సమావేశం..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 10 (అఖండ భూమి న్యూస్);

బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *గావ్ చలో – బస్తీ చలో అభియాన్ జిల్లా ప్రభారి గడ్డం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.

 

ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 11, 12, 13 తేదీలలో గావ్ చలో – బస్తీ చలో అభియాన్ లో భాగంగా అన్ని గ్రామాలలో, పట్టణంలోని అన్ని వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతాలను, సాధించిన విజయాలను, భవిష్యత్తు లక్ష్యాలను పార్టీ కార్యకర్తలకు వివరించి, తెలంగాణలో రాబోయే రోజుల్లో అధికారం దిశగా పోవడానికి కార్యకర్తల పని గురించి వివరించాలని అన్నారు. అదే విధంగా ఏప్రిల్ 14 న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలో సామాజిక సమరసత దివాస్ నిర్వహించి వారి విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, నాయకుడు వేణు, వెంకట్ వెంకట్, శ్రీనివాస్, బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!