అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మైనర్లు మృతి..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 10 (అఖండ భూమి న్యూస్):
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు బాలురు కుంటలో పడి మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండా కు చెందిన తేజావత్ సాయికుమార్ (16), భూక్యా సురేష్ (15) ఇద్దరు బాలురు ముత్యంపేట గ్రామం లోని కల్లుదుకాణంలో పనిచేస్తున్నారు. అయితే మూడు రోజులుగా వీరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.
గురువారం వీరిద్దరి మృతదేహాలు రాఘవాపూర్ గ్రామ శివారులో కుంట లో తేలాయి. వీరి మృతిపై అనుమానం ఉన్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న దేవునిపల్లి ఎస్సై రాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుర మృతికి గల కారణాలు తెలియరాలేదు. స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందార లేక ఎవరైనా కావాలని గుంతలోకి నుకి వేశారా అనే కోణంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు జరుగుతున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు.