వర్క్స్ బోర్డ్ సంస్కరణాల చట్టం విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 19 (అఖండ భూమి న్యూస్);
భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆద్వర్యంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన *వక్ఫ్ బోర్డు సంస్కరణల చట్టం* విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేసి ప్రజలను ముఖ్యంగా ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన *వక్ఫ్ బోర్డు సంస్కరణ చట్టం పై శనివారం అవగాహన కార్యక్రమం పేదల హక్కులు పేదలకే చెందుతాయి అనే శీర్షికతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర వక్ఫ్ సుధార్ జన జాగరన్ అభియాన్ సభ్యులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ వల్ల సామాన్య ముస్లిం లకు ఎలాంటి నష్టం జరగదు అని అన్నారు. ఈ చట్టం ప్రధానంగా వక్ఫ్ భూముల దుర్వినియోగాన్ని అరికట్టడం, పేద ముస్లిం సమాజానికి ఆస్తి పరిరక్షణ అందించడం, వాటి ఆదాయాన్ని ముస్లిం సమాజానికి లాభదాయకంగా ఉపయోగించేందుకు చేసిందే తప్ప ప్రతి పక్షాల ఆరోపిస్తున్నట్టు కాదని అన్నారు.
దేశంలో 8 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, వీటి ద్వారా 10 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చినప్పటికీ కేవలం 3 శాతం ముస్లిం లు మాత్రమే వీటిని అనుభవిస్తున్నారని , 97 శాతం ముస్లిం జనాభా కూడా ఈ ఫలాలు అందించాలన్నదే ముఖ్య ఉద్దేశం అని , అంతే కాకుండా కమిటీలో ముస్లిం మహిళలకు స్థానం కల్పించడం వల్ల లింగ వివక్షకు తావు ఇవ్వకుండా ఉంటుందని, ముస్లిమేతరులకు చోటు కల్పించడం ద్వారా భూ తగధాల విషయంలో ఏక పక్ష నిర్ణయాలకి తావు ఇవ్వకుండా ఉంటుందని అన్నారు.
వక్ఫ్ బోర్డు ఏకపక్షంగా ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి వీలు కల్పించే సెక్షన్ 40 ను సవరించడం ద్వారా ఏకపక్ష అధికారాలు వక్ఫ్ కి రద్దు అవుతాయి. వక్ఫ్ ఎవరి ఆస్తిని అయినా తనది అని వాదించినప్పుడు ఆ ఆస్తి హక్కు దారు కోర్టుకి వెళ్లేందుకు హక్కు కల్పించబడింది అని, ఇకపై ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ తన ఆస్తులుగా క్లెయిమ్ చేయరాదని అన్నారు.
ఈ వక్ఫ్ సవరణ పై ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజలకు ముఖ్యంగా ముస్లిం లను కలిసి నిజాలు తెలియజెయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, విపుల్, భరత్, ప్రవీణ్, నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు.