కల్తీకల్లు అమ్మితే 1908 టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేసి ఫిర్యాదు చేయగలరు..!
తెలంగాణ ఆంటీ నార్కోటెక్ బ్యూరో డి.ఎస్.పి ఉపేందర్.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 19 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలోని ఆయా పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కల్తీకల్లు అమ్మిన, అనుమతులు లేని కల్లు దుకాణాలు నడిపిన 1908 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి చెప్పిన వారి పేర్లను గోపయ్యంగా ఉంచుతామని తెలంగాణ ఆంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పి ఉపేందర్ అన్నారు. శనివారం జిల్లాలోని ఆయా మండలాలతో పాటు దోమకొండ మండలం దోమకొండ, ముత్యంపేట్, అంబరీ పేట్, సంగమేశ్వర గ్రామాలలో గ్రామ కేంద్రాలలో స్థానిక అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కల్తీ కల్లు, మత్తు పదార్థాలపై గ్రామస్తులకు గ్రామసభలు, పట్టణ సభలు నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా నిషేధిత మత్తు పదార్థాలతో పాటు కల్తీ కల్లు తయారుచేసి విక్రయించి బాన్సువాడ నియోజకవర్గం లోని గౌరారం గ్రామంలో 96 మంది పైగా కల్తీ కల్లు బారినపడి అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు కల్తీకల్లు బారిన పడి ఎంతోమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల పాలు అవుతున్నారని అన్నారు. కల్తీకల్లులో అల్పాజాలం, క్లోరోఫామ్, డైజోపాం, అనేక మత్తు పదార్థాలు కలిపి కల్తీ కల్లు తయారు చేయడం జరుగుతుందని అన్నారు. చిన్నారులతోపాటు, యువకులు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని ప్రాణాంతకమైన విష పదార్థాల వల్ల ప్రాణాలు అరించిపోతున్నారని అన్నారు. నిషేధిత మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా యువతను ముందస్తుగా కట్టడి చేసి రేపటి భావితరాలకు మత్తు బారిన పడకుండా మంచి సమాజాన్ని అందించాలని దానికి గ్రామాల పట్టణాల ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కల్తీ కల్లుతో పాటు, నిషేధిత గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా బంగారు భవిష్యత్తు కలిగిన యువత చెడు మార్గంలో నడవకుండా మంచి మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. వృద్ధులు కుటుంబ సభ్యులు యువత పిల్లల ముందు కల్లు, మద్యం సేవించకుండా ఉండాలని నిరంతరం పిల్లల నడవడికపై దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన చెట్టుకల్లును అందించాలనే ప్రభుత్వ లక్ష్యం కొంతమంది కల్తీ కల్లు ముస్తేదారులు ధనార్జన ధ్యేయంగా పనిచేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడ వద్దని అన్నారు. కల్తీ కల్లుపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్తీకల్లును అరికట్టేందుకు ప్రయత్నాలు ఉంగరం చేసినట్లు తెలిపారు. ఎం.ఎల్.హెచ్.పి జ్యోతి మాట్లాడుతూ. ఆస్పత్రులకు వచ్చిన రోగులకు మత్తు పదార్థాలకు అలవాటు పడి బానిసలు అయిన రోగులు బీపీ షుగర్ లెవెల్లో పడిపోయి ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇవ్వవలసి వస్తుందని అన్నారు. రోగులకు ఆపరేషన్లు చేయాల్సివస్తే మత్తు పదార్థాలకు అలవాటు పడి రోగులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన పూర్తి స్థాయి మోతాదులో సరిపోవడం లేదని అన్నారు. నిషేధిత మత్తు లేని తెలంగాణ రాష్ట్రం 100% సాధించినప్పడే రాష్ట్రం బున్ అన్ని రంగాల్లో ముందుంటుందని అన్నారు. పట్టణాల్లో ,గ్రామాల్లో కల్తీ కల్లు అమ్ముతే 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే కల్తీ కల్లు దుకాణాలను సీజ్ చేసి కల్తీ కళ్ళు ముస్తదారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ టోల్ ఫ్రీ నెంబర్ కు సహకరిస్తే వారి పేరును గోపయ్యంగా ఉంచుతామని అన్నారు. ఈ క్రమంలో ఎక్సైజ్ సీఐ మధుసూదన్ రావు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎస్సై స్రవంతి , జ్యోతి ఎం ఎల్ హెచ్ పి , ఏటీఎం రాజు, జిపి కార్యదర్శి యాదగిరి, కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి, అబ్రబోయిన స్వామి, తీగల తిరుమలగౌడ్, కదిరి గోపాల్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.