మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

 

మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

తప్పిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న ఎస్ఐ చౌడయ్య

ఐదేళ్ల తర్వాత కుటుంబంతో కలిసిన వ్యక్తి

అఖండ భూమి -యర్రగొండపాలెం

యర్రగొండపాలెం పోలీసులు మరోసారి తమ దర్యాప్తు నైపుణ్యాన్ని చాటారు. 2020వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన నమోదైన మిస్సింగ్ కేసును ఐదేళ్ల అనంతరం విజయ వంతంగా ఛేదించారు. తప్పిపోయిన శ్రీరాము లును కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయాన్ని ఎస్ఐ పి చౌడయ్య ఆదివారం వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తి కుంజు శ్రీరాములు(55), బోయ కులానికి చెందిన వ్యక్తి. యర్రగొండపాలెం నివాసి. అతను 2020వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన కనిపించకపో వడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ చౌడయ్య నేతృత్వంలోని బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివరాలను సేకరించి చివరికి ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారని, అవసరమైన చట్టపరమైన చర్యలు పూర్తి చేసి కుటుంబానికి అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ చౌడయ్య మాట్లాడుతూ ఎవరయినా తప్పిపోయిన విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!