ఓ బీసీ మేలుకో రాజ్యాన్ని ఎలుకో

 

ఓ బీసీ మేలుకో రాజ్యాన్ని ఎలుకో

– రాజ్యాధికార సాధన బీసీలకు అంతిమ లక్ష్యం కావాలి

– బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 18 (అఖండ భూమి న్యూస్);

ఫార్ములా 21 తో జిల్లా, పట్టణ ,మండల కమిటీల నిర్మాణం.

దేశంలో రాహుల్ గాంధీ భోదిస్తున్న సామాజిక న్యాయానికి, తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ విధానాలకు కుంతనా లేదని, 42 శాతం పదవులు బీసీలకా అగ్రవర్ణాలకా ? పదవులు,పనులు,కాంట్రాక్టులు అన్నీ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికే అని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ మండిపడ్డారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి లోగల మునుర్కాపు సంఘ భవనంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్ గౌడ్ నేతృత్వంలో మున్నూరు కాపు సంఘం భవనం దేవునిపల్లి కామారెడ్డి లో కాముని సుదర్శన్ నేత అద్యక్షతన, కుమ్మరి యాదగిరి ఆద్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని స్థాయిలలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తాం. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీల నియామకం, కులగణనతో తెలంగాణాలో సామాజిక విప్లవం మొదలయ్యిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న సామాజిక న్యాయానికి, రాష్ట్రంలో అమలు అవుతున్న సామాజిక న్యాయానికి ఏ మాత్రం పొంతనలేదని ఆవేదన వ్యక్తం చేశారు . రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు దక్కాల్సిన 42 శాతం అవకాశాలను , 4 శాతం జనాభా ఉన్న ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారన్నారు. ఈది ఏ విధమైన సామాజిక న్యాయమో ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇటీవల నియమించిన యూనివర్సిటీల వైస్ ఛాన్సులర్లు,లోకాయుక్త, సీఎంఓ (ముఖ్యమంత్రి) కార్యాలయ అధికారులు,కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీల కేటాయింపులు, ఉదయపూర్ డిక్లరేషన్ ఉల్లంఘన తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్న లోపభూయిష్ట విధానాలకు తార్కాణం అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలను, క్షేత్రస్థాయి స్థితిగతులను ముఖ్య నాయకులు విశ్లేషించారు. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ఫార్ములా 21ను అనుసరించి అన్ని కొత్త జిల్లాల్లో, నియోజక వర్గాలలో, మండలాలలో ప్రతీ యూనిట్ లో 21 మంది ముఖ్యులతో స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాలని, కార్యవర్గ నిర్మాణం పూర్తయిన వెంటనే క్యాడరుకు రెండు రోజుల శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాల పర్యటనలను విజయవంతంగా పూర్తిచేసి సంభందిత కమిటీలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఈ ప్రక్రియకు కొనసాగిoపుగా నూతన జిల్లాల పర్యటనను శుక్రవారం నుండి ప్రారంభింస్తున్నట్లు తెలిపారు. తథనంతరం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున బీసీ నాయకుల గెలుపు దిశగా తమ భవిష్యత్ కార్యాచరణను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వైద్య రాజగోపాల్ ,రాష్ట్ర మహిళా సభ్యురాలు జంగోని స్వరూప ,ఉత్తర తెలంగాణ ఇన్చార్జి బుర్ర కుమార్ గౌడ్, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొడుపు గంటి శ్రీధర్, బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి సూర్య మల్లేశ్, కామారెడ్డి జిల్లా బీసీ నాయకులు చింతల శంకర్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి రాజేందర్,జుక్కల్ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్చార్జి అశోక్ రాజ్, కో ఇన్చార్జి శ్రీనివాస్ యాదవ్, వివిధ మండల నాయకులు అంబాదాస్ , నవీన్,హరినాథ్ ఆర్య, శ్రీనివాస్, మంజుల, లక్ష్మీ, బీసీ యూత్ నాయకులు శ్రావణ్ కుమార్ గౌడ్, మహేష్, అరవింద్,యువకులు ,తదితర నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!