శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి వార్షికోత్సవం లో పాల్గొన్న మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు.
మాచారెడ్డి ప్రజాజ్యోతి ఏప్రిల్ 17.
మాచారెడ్డి మండలం ఎల్లంపేట్ గ్రామంలో శ్రీ లక్ష్మి దేవి అమ్మవారి 4వ వార్షికోత్సవంలో మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా లక్ష్మిదేవి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని,ప్రతి ఒక్కరికి ఆ తల్లి దీవెనలు లభించాలని కోరుకున్నారు.
ఈ లక్ష్మి దేవి అమ్మ వారి సేవలో ,గ్రామస్తులు,నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం ఉమ్మడి ఎల్లంపేట గ్రామ పంచాయితీ నుండి నూతనంగా ఏర్పడిన ఒడ్డెర గూడెం తండా గ్రామ పంచాయతీ కార్యాలయంను ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించడం జరిగింది.ఆయన సొంత నిధులతో గ్రామ ప్రజల కోరిక మేరకు నూతన గ్రామ పంచాయతీ లో ఒక హైమాక్స్ లైటింగ్ ను ఏర్పాటు చేయించి స్విచ్ బట్టన్ ఆన్ చేయడం జరిగింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని లోయపల్లి నర్సింగరావు కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ ఖాజా అలీ, సింగిల్ విండో చైర్మన్ పులచంద్ నాయక్,మాజీ సింగల్ విండో చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కామారెడ్డి మాజీ కౌన్సిలర్ రామ్మోహన్,మాజీ ఎంపీటీసీ రేన- చంద్రు నాయక్,మాజీ సర్పంచ్ లు,యూత్ సభ్యులు,మహిళ సంఘాల నాయకురాలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.