ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ నిరసన తెలిపిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్..
అఖండ భూమి వెబ్ న్యూస్ :
కేశనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరసన వ్యక్తం చేశారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం యొక్క అద్దె ఎలక్ట్రసిటీ బిల్లులు వెంటనే చెల్లించి వాటిని క్రమబద్ధీకరించాలని, ప్రతి నెల రావలసిన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని ఫలితంగా వారి కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాయని.. వెంటనే తగుచర్యలు తీసుకుని వారికి న్యాయం చేకూర్చాలని కేశనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వారి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయుష్మాన్ భారత్ నిబంధనలు ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ని రెగ్యులర్ చేయాలి చేసి ట్రాన్సఫర్ పాలసీని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి వెంటనే కల్పించాలి అని ఈపీఎఫ్ఓ పునరుద్దరణ చేయాలి చేసి ఎఫ్ ఆర్ ఎస్ ని మినహాయించాలి అని డిమాండ్ చేసారు. ఈ డిమాండ్స్ పై ప్రభుత్వం కసరత్తు చేసి వెంటనే తగుచర్యలు తీసుకుని మాకు న్యాయం చేకూర్చాలని కేశనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు నిరసన వ్యక్తం చేశారు.