గ్యాస్ వంటలు మాకొద్దు కట్టెల పొయ్య్ వంటలే మాకు ముద్దు

 

 

గ్యాస్ వంటలు మాకొద్దు కట్టెల పొయ్య్ వంటలే మాకు ముద్దు

*కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి*

అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకులు ధరలను ఉపసంహరించుకోవాలని(OPDR ) ఆధ్వర్యంలో నిరసన!

-ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ డిమాండ్.

బెల్లంపల్లి ఏప్రిల్ 17(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ గురువారం బెల్లంపల్లి అంబేద్కర్ చెవ్రస్థ లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో కట్టెల పోయి పై వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు చేసింది శూన్యం,ప్రచారం చేసుకునేది 100% అమలు చేసేది 10% ఇది మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలలో భాగమే.దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అన్నారు.ఈ సంక్షోభాన్ని కార్మికులు ప్రజలపై,పోవడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వలు ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలనే అమలుకు పూనుకున్నది ఈ 10 ఏండ్ల కాలంలో ఎన్ డి ఏ సర్కారు ప్రభుత్వ పరిశ్రమల మూసివేత,వాటాల విక్రాయం,స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు లాభాలను చేకూర్చి పెట్టడమే పనిగా పెట్టుకున్నది దీనినే అభివృద్ధిగా చెప్పుకుంటునది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న విధానాలన్నీ ప్రజల కోసమే మరి బుకాయిస్తున్నది. దీనిలో భాగంగా రైల్వే రక్షణ బీమా విమాన సహజ వాయువు బ్యాంకింగ్ లాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో వాటాలు,పెట్టుబడులు, ఉపసంహరించుకొని విదేశీ స్వదేశీ పెట్టుబడుదారులకు అవకాశాలు కల్పించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లాభాల్లో నడుస్తున్న కీలక రంగమైన బొగ్గు పరిశ్రమలో 100% విదేశీ స్వదేశీ పెట్టుబడుదారులకు తలుపులు తెరుస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించడం దుర్మార్గమైన చర్య అన్నారు.గత యూపీఏ 2 ప్రభుత్వం 243 బొగ్గు బ్లాకులను క్యాప్టివ్ మనిషిగా వేలం ద్వారా బడ పెట్టుబడిదారీ కంపెనీలకు అప్పగించినప్పుడు నీతులు వల్లించిన ఎన్డిఏ ప్రతిపక్షం ఇప్పుడు ఏకంగా 100% అంటే బొగ్గు రంగాన్ని విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు తెగ నమ్ముకునే కుట్ర తప్ప మరొకటి కాదన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది రేపు దిగిపోయేటోళ్లకు డిపెండెంట్ ఉద్యోగాలు నూతన భూగర్భ గనులు లక్ష ఉద్యోగాలు సొంత ఇంటి కాల మెడికల్ కళాశాల సర్వీస్ తో నిమిత్తం లేకుండా మెడికల్ ఇన్వాలిడేషన్ కాంట్రాక్టికర్ణ రద్దు,కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ హైపవర్ కమిటీ వేతనాలు ఐటి రద్దు,హోల్ కారిడార్ బొగ్గు ఆదరిత పరిశ్రమలు లాంటి అనేక హామీలతో అరి చేతిలో వైకుంఠాన్ని చూపుతున్నరన్నారు.

సామాన్య ప్రజలు జీవించడానికి కొనుగోలు చేసుకోవడానికి వీలు లేకుండా కేంద్ర ప్రభుత్వం తాను ఇష్టం వచ్చిన విధంగా నిత్యవసర సరుకుల ధరలతో పాటు పెంచివేసింది దీని ద్వారా సామాన్య పేద ప్రజలు రోడ్డుపైన పడవలసిన పరిస్థితి ఏర్పడ్డదన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్,డీజిల్,పెట్రోల్, నిత్యవసర సరుకుల ధరలను తక్షణమే ఉపసంహరించుకోని పేద ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు.లేని పక్షులంలో ప్రజలు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని క్షమించబోరని తగిన గుణపాఠం చెప్తారని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(OPDR) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా అధ్యక్షులు ఏన్నం శంకర్,బంక నారాయణ,వెంకటేశ్వర గౌడ్,మాణిక్, యాదగిరి,మల్లయ్య,కనకరాజు,సునీత, లలిత తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!