తరువాత కలిగిన నిరుపేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చాలి..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 17 (అఖండ భూమి న్యూస్);
అర్హత కలిగిన నిరుపేద కుటుంబాల వారిని ఇందిరమ్మ ఇండ్ల జాబితా కు ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం పాల్వంచ, మాచారెడ్డి మండల కేంద్రాలలో ఆయా మండలాల పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిరుపేద వర్గాల కుటుంబాల వారిని ఎంపిక చేసే విధంగా ఆయా ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తెలియజేయాలని అన్నారు. అర్హల జాబితాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ వారీగా సర్వే నిర్వహించాలని అన్నారు. అనంతరం మాచారెడ్డి లో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మండల ప్రత్యేక అధికారి సురేష్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…