కామారెడ్డి పట్టణంలోని 49 వార్డుల్లో ఎక్కడా కూడా త్రాగు నీటి సమస్య రావద్దు

 

కామారెడ్డి పట్టణంలోని 49 వార్డుల్లో ఎక్కడా కూడా త్రాగు నీటి సమస్య రావద్దు

ఎక్కడ సమస్య ఉన్నా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలి

నీటి సరఫరా సమయంలో ఇంటి యాజమానుల నుండి డబ్బులు వసూలు చేయరాదు

వార్డు ఆఫీసర్లు తమ వార్డుల్లో నీటి అవసరాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి*

నీటి సరఫరా సమయంలో రాజకీయ నాయకుల ఇళ్లల్లో గాని, అధికారుల ఇళ్లలో గాని సంపులో నీటిని పోయారాదు

కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 25 (అఖండ భూమి న్యూస్)

వేసవి నీటి ఎద్దడి దృష్టిలో పెట్టుకొని త్రాగు నీటి సమస్యలపై వార్డు అధికారులు, వాటర్ మెన్ లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వార్డు అధికారులు, వాటర్ మెన్ లతో వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ. కామారెడ్డి పట్టణంలోని 49 వార్డుల్లో ఎక్కడా కూడా త్రాగు నీటి సమస్య రావద్దనీ, ఎక్కడ సమస్య ఉన్నా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలనీ సూచించారు. ఇంటింటికి నీటి సరఫరా సమయంలో ఇంటి యాజమానుల నుండి డబ్బులు వసూలు చేయరాదనీ ఒక వేళ అలా చేస్తే కటిక చర్యలు ఉంటాయని అన్నారు. వార్డు ఆఫీసర్లు తమ వార్డుల్లో నీటి అవసరాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలనీ అన్నారు. ఏ వార్డులో నీటి సమస్య ఉందని పిర్యాదు వచ్చిన సంబంధిత వార్డు అధికారి బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఇంటింటికి నీటి సరఫరా సమయంలో సామాన్య ప్రజలకు ఎలా నీటి సరఫరా చేస్తామో అలాగే మాజీ తాజా ప్రజాప్రతినిధులైన అన్ని పార్టీ ల నాయకులు కూడా అలాగే సరఫరా చేయాలి కానీ రాజకీయ నాయకుల ఇళ్లల్లో బు గాని, అధికారుల ఇళ్లలో గాని సంపులో నీటిని పోయారాదనీ సూచించారు. పోస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, బిజెపి జిల్లా కార్యదర్శి నరేందర్ రెడ్డి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!