ఇల్లు లేని న్నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి..

 

ఇల్లు లేని న్నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 26 (అఖండ భూమి న్యూస్);

అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం దోమకొండ మండల కేంద్రం లోని షేక్ అల్మా బేగం, భర్త – సద్దాం పాషా ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. తాను, తన భర్త కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లల కుటుంబాలతో నివసిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనీ కలెక్టర్ ను కోరారు. ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ కవర్స్ లతో కప్పబడి ఉన్న ఇంటిలో గత 20 సంవత్సరాల నుండి నివసిస్తున్నామని, తన కున్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇల్లు నిర్మించుకుంటానని ఆమే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని జ్యోతి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!