ముగిసిన కబడ్డీ పోటీలు 

 

 

ముగిసిన కబడ్డీ పోటీలు

డ్రగ్స్ కు దూరంగా ఉంచడానికే క్రీడా పోటీలు,యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఏసీపీ రవికుమార్ పిలుపు

బెల్లంపల్లి ఏప్రిల్ 27(అఖండ భూమి న్యూస్ ):మంచిర్యాల జిల్లా తాండూరు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆంటీ డ్రగ్ అవేర్నెస్ కబడ్డీ పోటీలు డ్రగ్స్ కు యువత ను దూరంగా ఉంచడానికే ఇలాంటి క్రీడా పోటీలు యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రీడా పోటీలో పాల్గొనడం వల్ల అనుకున్న ఆశయాలను అధిగమించవచ్చు క్రీడల వల్ల ఉద్యోగాలు సాధించవచ్చు,బెల్లంపల్లి సబ్ డివిజన్ స్థాయిలో 20 జట్లు పాల్గొన్నాయి,వాటిలో ప్రధమ స్థానంలో వేమనపల్లి ఏ,నిలువగా,తాండూర్ బీ జట్టు నిలిచింది, మూడవ స్థానం లో తాండూర్ ఏ జట్టు,నాలుగవ స్థానం లో మందమర్రి ఏ జట్టి నిలిచింది, వీరికి మొదటి బహుమతి,40,000/-రెండవ బహుమతి 30,000/-

మూడవ బహుమతి 20,000/-నాలుగోవ బహుమతి 10,000/-అందజేశారు.ఈసందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ… గంజాయి,డ్రగ్ కు యువత చేడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడా పట్ల ఆసక్తి చూపాలన్నారు.ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ…యువత క్రీడల వల్ల శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసంగా కలిగి యువత ఆరోగ్య వంతులుగా ఉంటారన్నారు.యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉంచడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇలాటి కార్యక్రమాలు చేపట్టిన తాండూరు సిఐ కుమార్ స్వామికి అభినందనలు తెలిపారు.యువత కోసం అన్ని విధాలుగా అదుకుంటానని యువతకు ఏమి కావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి బెల్లంపల్లి నియోజకవర్గ యువత అన్ని రంగాల్లో ముందు ఉంచడాని కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ, బెల్లంపల్లి 1టౌన్ ఎస్హెచ్ఓ,నేన్నెలా ఎస్ఐ,భీమిని ఎస్ఐ,మాదారం ఎస్ఐ,కన్నెపల్లి ఎస్ ఐ గోలేటి జీ ఎం, గోలేటీ మ్యానేజర్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!