పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి..

 

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి..

-ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..

-పట్టుబడ్డ వారిలో బారాస నాయకుడు..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఏప్రిల్: 28 (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్.. ఆలూరు బైపాస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న గడ్డం మల్లారెడ్డి అతిథి గృహంలో పేకాట ఆడుతున్నారని పూర్తి సమాచారం మేరకు సిసిఎస్ ఎసిపి నాగేంద్ర చారి ఆదేశాలతో సి సి ఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పేకాట స్థావరం పై దాడి చేసి గడ్డం మల్లారెడ్డి. ఉట్నూర్ వెంకటేష్. మజ్జరి రామకృష్ణ. ఇట్టడి శ్రీనివాసరెడ్డి. గడ్డం నారాయణరెడ్డి. మూతుల అశోక్ రెడ్డి. లోక సూర్య ప్రకాశ్ రెడ్డి ఏడుగురిని అరెస్టు చేసి ఏడు మొబైల్ ఫోన్లు. ఫోన్ పే బెట్టింగ్ 2.56.830 ను సీజ్..21830 నగదు స్వాధీనం చేసుకుని సంబంధిత ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బారాస శ్రేణులు.. నాయకులు.. కార్యకర్తలు వరంగల్ ఎల్కతుర్తి లో రజతోత్సవ సంబరాల్లో బిజీగా ఉంటే బారాస నాయకుడు రజతోత్సవానికి డుమ్మా కొట్టి పేకాటలో పట్టుబడడం ఆశ్చర్యం కలిగించిందని ఆర్మూర్ పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ బదిలీపై వచ్చాక పేకాట. మట్కా. కోడిపందాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో దాదాపుగా కనుమరుగయ్యాయి. మళ్లీ ఆదివారం రోజు పేకాట స్థావరంలో పెద్ద మొత్తంలో డబ్బులు దొరకడం ఆందోళన కలిగిస్తోందని ప్రజలు చెప్పుకుంటున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!