జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు జిల్లా.  – ఎస్సీ యం. రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్ 

 

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు జిల్లా.

– ఎస్సీ యం. రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 30 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (మే 1వ తేది నుండి 31 వరకు) జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్సీ. యం. రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్ అన్నారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపినారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!