అప్పుల బాధ భరించలేక యువకుడు ఆత్మహత్య…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 3 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో అప్పుల బాధ భరించలేక యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమకొండలో చోటుచేసుకుంది. దోమకొండ ఎస్సై స్రవంతి వివరాల మేరకు పంతులు గారి పెంటయ్య (26) ఎకరాల వ్యవసాయ భూములు నీటి కొరత ఉన్నందున సుమారు 10 వరకు బోరు బావులు వేసి అప్పుల పాలైనట్లు తెలిపారు. అప్పులు అధికమై జీవితంపై విరక్తి చెంది ఉదయం ఐదు గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.