ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖకు పెద్దపీఠం…!
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 3 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తమ ప్రభుత్వం మొదట విద్యాశాఖ కు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. అనంతరం
కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తుగా షబ్బీర్ అలీ,. గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో పదవ తరగతిలో రాష్ట్రస్థాయి ర్యాంక్ ప్రసాదించిన వారికి నగదు పారితోషకం అందించి సన్మానం చేశారు.
ఎస్పీఆర్ స్కూల్ కు చెందిన రాష్ట్ర టాపర్ నిమ్మ అణిచిత596
కొండ గాయత్రి ఎస్పీఆర్ స్కూల్ 590
తడుపునూరి శ్రీనిత ఎస్పీఆర్ స్కూల్ 590
బి రమేష్ ఎం జె పి ఎర్ర పహాడ్ తాడవాయి మండల్ టాపర్ 587
మౌర్య ఆనంద్ రెడ్డి ఎం జి పి ఎర్రపాడు 581 తాడ్వాయి మండల్
టీ నిక్షియా టిఎన్ఆర్ ఇజేఎస్. లింగంపేట్ మండల్ 581.
జి బావిక జిల్లా పరిషత్ హై స్కూల్ కల్వరాల్ 581 సదాశివ్ నగర్ మండల్.
సభా తపస్సు జిల్లా పరిషత్ హై స్కూల్ మాచారెడ్డి 581
వీరిని అభినందించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ గారు మాట్లాడుతూ.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
జిల్లాకు ఒకటి ఇంటర్గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు మొదలు పెట్టమన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెంచే కార్యక్రమం చేపట్టాలని గ్రామ గ్రామాన తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా కౌన్సిలింగ్ చేయాలన్నారు.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి అన్నారు.
ఇంత వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ..ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారని వెల్లడించారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…