అరెస్ట్ చేయాలని కలెక్టర్ వినతి పత్రం అందజేత…

 

పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోహింగ్యాలపై సర్వే చేసి అరెస్ట్ చేయాలని కలెక్టర్ వినతి పత్రం అందజేత…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 7 (అఖండ భూమి న్యూస్);

బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాల విషయమై ప్రత్యేక సర్వే చేసి, కాటన్ సెర్చ్ నిర్వహించి అరెస్ట్ చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం బుధవారం అందించారు.

 

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా పాకిస్థాన్ వారిని దేశం నుండి వెళ్ళిపోవాలని కేంద్ర ఆదేశించడం జరిగింది. ఆ యొక్క ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని, అదే విధంగా జిల్లాలో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్ వారిని, రోహింగ్యాలను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాల విషయమై ప్రత్యేక సర్వే చేసి, కాటన్ సెర్చ్ నిర్వహించి అరెస్ట్ చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ తరుపున గౌరవ కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు నేహాల్, నాయకులు నరేందర్, వెంకట్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!