లైసెన్సుడ్ సర్వేయర్లకు శిక్షణ దరఖాస్తులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 8 (అఖండ భూమి న్యూస్);
ఈ నెల 17 వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ
రెవిన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే , ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి సహాయపడటానికి రాష్ట్రంలో దాదాపు 5000 లైసెన్సు పొందిన సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నదనీ, అర్హత కలిగిన వారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం వార్తా పత్రికలలో నోటిఫికేషన్ జారీచేయబడిందని, ఈ నెల 5 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుచున్నదని తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన సర్వేయర్లు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్ గణితంలో 60% మార్కులు సాధించిన వారు, ఐ.టి.ఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్(సివిల్) లేదా సమానమైన అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపిక చేయబడిన ఈ సర్వేయర్లకు ఈ నెల 26 నుండి జూలై 26 వరకు 50 పని దినాలు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వబడుతాయని ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా ఈ నెల 17 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
.