మహిళా శక్తి భవనం నిర్మాణం పూర్తి చేయాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 7 (అఖండ భూమి న్యూస్);
మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ వెనుక భాగంలో నిర్మిస్తున్న మహిళాశక్తి భవనం పనులను గురువారం రోజున కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళాశక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అన్నారు. నిర్మాణం పనులను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు 5 కోట్ల రూపాయలతో పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పనులు పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, చందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, ఇతర ఇంజనీర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
.