భూభారతి చట్ట ప్రకారం వచ్చిన ఆర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి…
రెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 9 (అఖండ భూమి న్యూస్);
భూ భారతి చట్టం ప్రకారం వచ్చిన అర్జీలను చట్ట ప్రకారం పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం లింగంపేట్ ఎంపీడీఓ సమావేశ మందిరంలో రెవిన్యూ టీమ్ లతో సమావేశం నిర్వహించారు. గత నెల 17 నుండి 30 వరకు లింగంపేట్ మండలంలో భూ భారతి చట్టం ప్రకారం 23 రెవిన్యూ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు క్రింద రెవిన్యూ సదస్సులు నిర్వహించి భూములకు సంబంధించిన అర్జీలను స్వీర్ణించారని, అట్టి చట్టం ప్రకారం 4225 దరఖాస్తులు రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆయా అర్జీలను పరిశీలించి పరిష్కరించడానికి 9 టీమ్ లను ఏర్పాటు చేసి, దరఖాస్తుల ప్రకారం భూములను పరిశీలించడం జరుగుచున్నదని తెలిపారు. ఇప్పటి వరకు 1443 దరఖాస్తులకు సంబంధించిన క్షేత్ర పర్యటన చేసి భూములను పరిశీలించడం జరిగిందని తెలిపారు. మిగతా దరఖాస్తు లకు సంబంధించిన వాటిని త్వరగా పరిశీలించాలని అన్నారు. అటవీ క్షేత్రాల్లోనూ భూముల ను జాయింట్ సర్వే చేయాలనీ సూచించారు. దీర్ఘకాలిక పెండింగు దరఖాస్తులను కూడా పరిశీలించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ ప్రభాకర్, భూ భారతి ప్రత్యేక అధికారి రాజేందర్, ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు శ్రీనివాస్, అటవీ అభివృద్ధి అధికారి రామకృష్ణ, తహసీల్దార్లు, రెవిన్యూ, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.