పోలీస్ వడ్ల శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటాం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 9 (అఖండ భూమి న్యూస్);
విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా, బి.సి.సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రేహాండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి శుక్రవారం పాల్వంచకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిస్కరించుకోవాలని, హింసా మార్గాన్ని విడనాడాలని ఆయన అన్నారు. మరణించిన శ్రీధర్ కుటుంబానికి 2.17 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందజేయ బడుతుందని తెలిపారు. తొలుత శ్రీధర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ పాల్గొన్న ఎంపీ సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, శాసన సభ్యులు మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ లు పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం.పోలీసు గౌరవ వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేహ్యాండ్ కమాండర్ ఆపరేషన్ రాఘవెందర్ రెడ్డి, ఓ ఎస్ డి దయానంద్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డి.ఎస్.పి శంకరయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవిన్యూ వి.విక్టర్, ఆర్డీఓ వీణ, పోలీసు, రెవిన్యూ, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


