ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దళితులపై కుల వివక్ష చూపడంలో మొదటి స్థానంలో ఉంది… చీకురుమెల్లి రవికుమార్.

 

ఆంధ్రప్రదేశ్ అఖండ భూమి వెబ్ న్యూస్ : రాజమహేంద్రవరం కేంద్ర కర్మాగారం సూపరింటెండెంట్ ఎన్ రాజారావుని ఆకస్మిక బదిలీ చేయడం కచ్చితంగా కుల వివక్షే నని , అలాగే చివరకు గిరిజనులపై కూడా వివక్ష చూపడం మొదలు పెట్టేసారని, 2024 లో కచ్చితంగా దళితులు అంతా కలిసి, జగన్మోహన్ రెడ్డికి,తగిన బుద్ది చెబుతారని, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి: చీకురుమెల్లి రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒక దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంత బాబుకి బేలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం అయితే, హత్యాయత్నం చేశాడని ఆరోపిస్తున్న, కోడికత్తి శ్రీను కి, ఎందుకు 4 సంవత్సరాలు గడుస్తున్నా బేలు ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. నిందితుడు ఆనంతబాబుకి దళిత రెడ్లు హారతి పట్టి, స్వాగతం పలకడం విష సర్పానికి పాలు పోసి పెంచడమే అన్నారు. అమలాపురంలో విశ్వరూప్  నూతన గృహప్రవేశానికి అనంత బాబును ఆహ్వానించడాన్ని రవికుమార్ గారు మీడియా ద్వారా తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా దళిత సోదరులు అందరూ , దళిత ద్రోహులను గుర్తిస్తే మంచిది అని, అలాగే ఆనంతబాబును గృహ ప్రవేశానికి ఆహ్వానించిన విశ్వరూప్కి  దళితులు ఇచ్చే ప్రతిఫలం, రాజకీయ సన్యాసమే నని,రవికుమార్  మీడియాకు తెలియజేసారు.

Akhand Bhoomi News

error: Content is protected !!