20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి…

 

20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 13 (అఖండ భూమి న్యూస్) :

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ. అనుబంధ సంఘం. మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను మే 20వ తేదీన విజయవంతం చేయాలని అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పోస్టర్లు మంగళవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ దశరథ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలరాజ్ మాట్లాడుతూ. నాలుగు లేబర్ కోడులను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, అదేవిధంగా ఈ 20 తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనము 60 జీవో ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని అలాగే 18 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని అనేకసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసిన కార్మిక చట్టాలను పట్టించుకోకుండా కాంట్రాక్ట్ విధానాన్ని కొనసాగిస్తున్నారని కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని కార్మికులకే పని ఇవ్వాలని కార్మికుల శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు. కార్మికుల యొక్క రోజువారి కొన్ని కారణాలవల్ల రానివారి డబ్బులు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు డబ్బులు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు మిగిలిపోతున్నాయని ప్రభుత్వమే అవుట్ సోర్సింగ్ కార్మికుల గా లేదా థర్డ్ సెక్షన్ కార్మికులుగా కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటే కోట్లాది రూపాయలు కార్మికుల డబ్బులు మిగులుతాయని గుర్తు చేశారు. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26వేల రూపాయలు ఇవ్వాలని లేదా 65వ ప్రకారం 21000 ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట తప్పి కేవలం 15 వేల 600 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎలాంటి జీవో లేకుండా 11000 కార్మికులకు 3000 రూపాయలు పిఎఫ్ ఈఎస్ఐ పేరుతో అదనంగా వెయ్యి రూపాయలు కాంట్రాక్టర్ కండ్ల కనపడ్డట్టుగా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారాని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కార్మికులకు పని ఇచ్చి కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల కనీస ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయించాలని పని భారాన్ని తగ్గించాలని కార్మికులకు కనీస జాతీయ సెలవులు ఇవ్వాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు మరియు ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ దశరథ్. ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలరాజ్ కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాస్ జిల్లా కోశాధికారి ఎండి రఫీ కామారెడ్డి ప్రభుత్వ పట్టణ అధ్యక్షులు సందీప్, ఆసుపత్రి కార్మికులు, ఖై రత్ అలీ ,భాస్కర్ ,రజిత, లక్ష్మి, జమున, నాగమణి ,వాసవి ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!