ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో ఓ పాజిటివ్ రక్తం అందజేత.
46 వ సారి రక్తదానం చేసిన సంతోష్ రెడ్డి..
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రమౌళి కి హైదరాబాద్ లోని యశోద వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 46 వ సారి రక్తదానం చేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మంగళవారం తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందనలను తెలియజేశారు.దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట రక్తం అవసరం ఉంటుందని రక్తదాతలు మానవత దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తం అందజేస్తే ప్రాణాలను కాపాడవచ్చునని అన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…