వరి ధాన్యం తూకంలో వ్యత్యాసం రాకుండా చూడాలి…
కామారెడ్డి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి . విక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 13 (అఖండ భూమి న్యూస్);
వరి ధాన్యం తూకంలో వ్యత్యాసం రాకూడదని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) అన్నారు. మంగళవారం లింగంపేట్ మండలం కోమటిపల్లి, పోతాయిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వాతావరణ శాఖ సమాచారం మేరకు అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉందని, రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కప్పి వేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు టార్ఫాలిన్ లను అందుబాటులో ఉంచుకోవాలని, రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. ధాన్యం తూకాల్లో వ్యత్యాసం రాకుండా చూడాలని హమాలీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా కేంద్రాల ఇంచార్జీలు, రైతులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…