మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లికి వందనం కార్యక్రమం..

 

 

మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లికి వందనం కార్యక్రమం..

ఐ. పోలవరం అఖండ భూమి  వెబ్ న్యూస్:

ఐ. పోలవరం మండలం ఐ.పోలవరం ఎస్సీ పేట గ్రామం అంగన్వాడి కేంద్రం నందు తల్లికి వందనం అంటూ చిన్నారులు వారి వారి తల్లులకు పాద పూజ చేసి పూలతో అలంకరించారు. చిన్న వయసు నుండి పిల్లలకు ఇటువంటి కార్యక్రమాలు చేయించడం ద్వారా తల్లిదండ్రుల పట్ల ఆప్యాయత గౌరవ మర్యాదలు పెరుగుతాయని సమాజంలో పెద్దల పట్ల గౌరవం పెంపొందించుతుందని ఆదర్శ పౌరులుగా ఎదగడానికి ఈ వయసు పిల్లలో క్రమశిక్షణ అలవాటు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని అంగన్వాడికార్యకర్త జి. అనంతలక్ష్మి పేర్కొన్నారు ఈ విధమైన కార్యక్రమం చేయడం ద్వారా మాకు ఎంతో ఆనందంగా ఉందని తల్లులు హర్షం వ్యక్తం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!