ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 12 (అఖండ భూమి న్యూస్);
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈ రోజు ప్రజావాణి లో (76) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యా సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగులో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తు దారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో చందర్, ఆర్డీఓ వీణ, పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


