నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం…

కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 12 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం హర్షనీయం అని కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో నీ డబుల్ బెడ్ రూమ్ కాలనీ దుకాణ సముదాయంలో ఏర్పాటు చేసిన 30 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించామ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఈ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అద్భుతంగా ఉందని అన్నారు. కేవలం దిగువ మధ్య తరగతికి చెందిన ప్రజలు ముందుకు వచ్చి తల కొంత డబ్బు జమ చేసుకొని ఈ రోజు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని మాతో ప్రారంభింప చేయడం అభినందనీయం అన్నారు ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం పై ధన్యవాదాలు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు అనేది నేర పరిశోధనలో నేరాలను అరికట్టడంలో, నేరస్తులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయని, అంతేకాకుండా వందమంది పోలీసులతో సమానంగా గొప్ప పని చేసిన కాలనీవాసులకు ఈ సందర్భంగా అభినందించారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఆర్థికంగా పేదరికంలో ఉన్న ప్రజలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ముందుకు రావడంపై ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు కాలనీవాసులు పాల్గొన్నారు.


