ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ రాజేష్ చంద్ర…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లు సమీక్షించి, సిబ్బందికి కీలక సూచనలు అందజేశారు.
కామారెడ్డి టౌన్‌లోని సాందీపని కాలేజీ పరీక్షా కేంద్రాన్ని స్వయంగా సందర్శించి, అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచనలను ఇచ్చారు.
ఈ సందర్భంగా, పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండి, శాంతి భద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.