రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తే మంచి దిగుబడును సాధించవచ్చు…
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 19 (అకాండ భూమి న్యూస్);
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమం ప్రవేశ పెట్టిన ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు అవగాహన కల్పించుకొని, సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం బీబీపేట్ మండలం యాడారం గ్రామంలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని రైతులు వరి పంట కు బదులు ఆయిల్ పామ్ సాగుచేసి అధిక దిగుబడి తో పాటు అధిక సొమ్ము సంపాదించవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో లేబర్ ఖర్చు తక్కువ అని, డ్రిప్ ఇరిగేషన్ తో సాగుచేయవచ్చని, దిగుబడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారిని జ్యోతి ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ కు ఒక ఎకరానికి 4200 సబ్సిడీ రూపంలో నాలుగు సంవత్సరాల అందజేయడం జరుగుతుందనీ తెలిపారు. డ్రిప్పు కూడా SC ST రైతులకు 100%, చిన్న , సన్నకారు రైతులకు 90%, పెద్ద రైతులకు 80% సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది అని వివరించారు. అదేవిధంగా హిందుస్థాన్ యూనిలీవర్ మల్టీ నేషనల్ కంపెనీ నుండి విచ్చేసిన అధికారులు వరుణ్, విజయ రామస్వామి కచ్చితంగా మన జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి కసరత్తు చేస్తున్నామని, రైతులు ఆయిల్ పామ్ సాగు చేసుకుని లాభాలు సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, హిందూస్తాన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.