స్వాతంత్య్రసమారయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో భూ పోరాటాలు..!
సి పి ఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 19 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం లో పుచ్చలపల్లి సుందరయ్య గారి 40 వ వర్ధంతినీ సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ. పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు ప్రజలు భూ పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సుందరయ్య జీవితం దేశ ప్రజలకు ఆదర్శమన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీగా గెలిచి పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లిన ఒకే ఒక్క వ్యక్తి అని ఆయన అన్నారు. సుందర్ రాంరెడ్డి గా ఉన్న ఆయన పేరును సుందరయ్యగా మార్చుకుని హనుమంతుకు వచ్చిన 200 ఎకరాల భూమిని పేద ప్రజలకు వచ్చిన మహనీయుడు అన్నారు. స్వాతంత్ర పోరాటం నుంచి భూ పంపిణీ జరిగిన పోరాటాల్లో ఆయన పాల్గొని అనేక నిర్బంధాలను ఎదుర్కొని నిలబడ్డ ప్రజా నాయకుడని అన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాత అయినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పోరాట స్ఫూర్తితో ఈ జిల్లాలో ప్రాంతమైన అసెస్మెంట్ భూములు వాటిని పేద ప్రజలకు అర్హులకు ఇచ్చేంతవరకు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు, మండల నాయకులు మాడుగుల ప్రవీణ్, పేరం నర్సవ్వ, బాబ్జాన్ శ్యామల ,హనుమాన్లు, సాయి కృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.