ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి తదుపరి చర్యలు అధికారులు చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశిష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 19 (అఖండ భూమి న్యూస్);
ప్రజావాణి లో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై అర్జీలు అందాయి. ఈ రోజు ప్రజావాణి లో (96) అర్జీలు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి ఆయా శాఖల అధికారులు సాధ్యా సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగులో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తు దారునికి రాత పూర్వకంగా సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ వీణ, పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


