వరల్డ్ క్యాండిల్ లైట్ డే …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 18 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి. జిజిహెచ్ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ డే నిర్వహించారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన బాధితుల స్మారకార్థం సందర్భంగా ప్రతి ఏటా ఈనెల మూడవ ఆదివారం క్యాండిల్ లైట్ డే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక ఆసుపత్రి ఆవరణలో కొవ్వొత్తుల ను వెలిగించి ర్యాలీ నీ ఎన్ హెచ్ ఎం డిపిఓ పద్మజా, ఏ ఆర్ టి మెడికల్ ఆఫీసర్ డా.స్నేహ, డాక్టర్ ప్రీతి కమల, ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆస్పత్రి నుంచి ఇందిరా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగించారు. హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని వారు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ టి, ఐ సి టి సి కౌన్సిలర్లు మేక నాగరాజు, గోపాల్, మెహరాజ్, ప్రవీణ్, లలిత కుమారి , వర్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు రాణి, రమేష్, వై ఆర్ జీ కేర్ డిఆర్పి సుధాకర్, సేవా సంఘంPM గోపాల్ మరియు సిబ్బంది , ఐ ఎస్ ఆర్ డి ప్రతినిధి రాజేందర్, వివిధ ఎన్జీవోల ఔట్రిచ్ వర్కర్లు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



