జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో దళిత భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు…

 

జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో దళిత భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు…

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 22 ( అఖండ భూమి న్యూస్ );

దళిత వైతాళికులు,సంఘ సంస్కర్తగా ప్రఖ్యాతులైన భాగ్యారెడ్డి వర్మ గారి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం . రాజేష్ చంద్ర పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎస్.పీ భాగ్యరెడ్డి వర్మ స్ఫూర్తిదాయక జీవితం, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సమాజంలో ఆయన పాత్రను వివరించారు. స్వాతంత్ర్యం రాకముందే దళితుల సమాన హక్కుల కోసం పోరాడి, అనేక దళిత బాలికల పాఠశాలలు స్థాపించి వేలాది విద్యార్థులకు విద్య అందించిన మహనీయుడని గుర్తుచేశారు.

కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి , డీఎస్పీలు మదన్లాల్ , యాకూబ్ రెడ్డి , ఏఓ ఎండి. అప్సర్ , సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!