కొనుగోలు కేంద్రాలనుండి త్వరగా మిల్లులకు దాన్యం తరలించాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 23 (అఖండ భూమి న్యూస్);
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ వి. విక్టర్ (రెవిన్యూ) అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రియల్, కామారెడ్డి మండలంలోని సారంపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం కానున్న దృశ్య, అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోతున్నదని, వరి పంట తడిసిపోకుండా ముందస్తుగా తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించాలని కేంద్రం ఇంచార్జీలను ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్ లను వరి పంటపై కప్పివేయాలని తెలిపారు. ఆయన వెంట సంబంధిత తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, కేంద్రాల ఇంచార్జీ లు ఉన్నారు.