25న జరిగే గ్రామ పాలన ఎంపిక పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 23 (అఖండ భూమి న్యూస్);
ఈ నెల 25 న జరుగనున్న గ్రామ పాలన ఎంపిక పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష నిర్వహణకు ఇన్విజిలేటర్స్ లకు, పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25 న ఆదివారం రోజున కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో (అటానమస్) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష ఉదయం గం.10.30 నుండి మధ్యాహ్నం గం.1.30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లాలో 402 మంది పరీక్ష రాస్తున్నట్లు, గతంలో వి.ఆర్.ఒ , వి.ఆర్. ఏ. లుగా పనిచేసిన వారు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు ఫోటోతో కలిగిన గుర్తింపు కార్డ్ వెంట తీసుకురావాలని తెలిపారు. ఈ పరీక్ష నిర్వహనకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలనీ తెలిపారు. పరీక్ష కేంద్రంలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. పరీక్ష జరుగు సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఏఎన్ఎం లను అవసరమైన మందులతో సహా డిప్యూట్ చేయాలని తెలిపారు. పరీక్ష హాలులోకి వెళ్ళే సమయంలో అభ్యర్థులను నిశిత పరిశీలన చేయడం జరుగుతుందని, అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు, గాడ్జెస్ అనుమతించబోమని తెలిపారు. ఉదయం గం. 9.30 లకు అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించడం జరుగుతుందని, 10 గంటలకు మెయిన్ గేటు మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. 10.25 లకు ప్రశ్న పత్రాలు అభ్యర్థులకు పంపిణీ చేయడం, గం. 10.30 లకు పరీక్ష ప్రారంభం అవుతుందని తెలిపారు. మధ్యాహ్నం గం.1.25 లకు హెచ్చరిక గంట మోగించబడుతుందని, చివరగా గం.1.30 లకు పరీక్ష నిర్వహణ పూర్తయి జవాబు పత్రాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు సమయ పాలన పాటించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ వి. విక్టర్ మాట్లాడుతూ, అభ్యర్థులు సమయానుకూలంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, మాస్ కాపీయింగ్ కు పాల్పడకూడదని తెలిపారు. ఇన్విజిలేటర్లు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఆర్డీఓ వీణ, చీఫ్ సూపరింటెండెంట్ విశ్వ ప్రసాద్, పరిశీలకులు శంకర్, జిల్లా విద్య శాఖాధికారి రాజు, తదితరులు పాల్గొన్నారు.
.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…