ఏసీబీకి చిక్కిన కోర్టు కానిస్టేబుల్

 

ఏసీబీకి చిక్కిన కోర్టు కానిస్టేబుల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 23 (అఖండ భూమి న్యూస్ );

కామారెడ్డి జిల్లా కోర్టు లో ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అలాగే సంజయ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. గతంలో 2018లో ఒ కేసు రిజిస్ట్రేషన్ అయింది. ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర 15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పదివేల రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు అని అవినీతి నిరోధక శాఖ డిఎస్పి రాజశేఖర్ గౌడ్ తెలిపారు. తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరస్తామని తెలిపారు . అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!