చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్ అఖండ భూమి వెబ్ న్యూస్ :
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళ సహా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు..
భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు(ఐఈడీ), ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో కాల్పులు జరిగినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శర్మ తెలిపారు. డీఆర్‌జీ పెట్రోలింగ్ బృందంపై నక్సలైట్లు కాల్పులు జరిపారని, ఆ తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులుజరిగాయని పేర్కొన్నారు.చెప్పారు. జవాన్ల చేతిలో హతమౌన మావోయిస్టులను గుర్తించారు. రూ 8 లక్షల రివార్డ్ కలిగిన ఎస్‌ఓఎస్ కమాండర్ మావోయిస్ట్ మడ్కం ఎర్రతోపాటు మూడు లక్షల రివార్డ్ కలిగిన పొడియం భీమేగా గుర్తించారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



