పదోతరగతి ఫలితాల్లో ఆరోతరగతి విద్యార్థిని  తన సత్తా చాటింది

 

కాకినాడ మే 07 అఖండ భూమి వెబ్ న్యూస్ : ప్రతిభ ఉంటే తరగతితో సంబంధం లేదంటూ ఆ చిన్నారి నిరూపించింది. ఏకంగా ఆరో తరగతి చదువుతూనే, పదోతరగతి పరీక్షలు రాసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది.

వివరాల్లోకి వెళ్లితే.. కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ముప్పల హేమ శ్రీ చదువులో అసమాన ప్రతిభ కనబరుస్తుంది. దీంతో ఈమె టాలెంట్‌కు ఫిదా అయిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా హేమశ్రీ తెలివితేటలు పరీక్షించి టెన్త్ పరీక్షలు రాయడానికి అనుమతిచ్చారు. దీంతో శనివారం వెలువడిన ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాల్లో హేమ శ్రీ తన సత్తాచాటింది. 488 మార్కులతో ఔరా అనిపిస్తుంది. దీంతో ఈ చిన్నారి తెలివి తేటలు చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!