రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి – జనసేన మండల అధ్యక్షులు వెలగల వెంకట రమణ
నాతవరం మండలం మే 30 అఖండ భూమి,
నాతవరం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. వెంకటరమణ మాట్లాడుతూ జూన్ 1 న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరికి రేషన్ అందించే కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యలు నాదెండ్ల మనోహర్, ఆదేశాలతో నాతవరం మండలంలో ప్రతీ గ్రామంలో రేషన్ డిపోల దగ్గర బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి రేషన్ కార్డు లబ్ది దారునికి రేషన్ పంపిణీ అయ్యేలా ఆ పంచాయతీ పరిధి లో కూటమి నాయకులు అందరూ తప్పనిసరిగా పర్యవేక్షించాలని ఆయన కోరారు.
*



