సీఎం రిలీఫ్ పాండును అందజేసిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గం లోని పలు మండలాల చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ చేతుల మీదుగా శుక్రవారం పంపించేశారు. నియోజకవర్గంలోని కామారెడ్డి, దోమకొండ, బిబిపేట్, బిక్కనూర్, రాజంపేట, మాచారెడ్డి, పాల్వంచ మండలం సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.