లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి…

లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి…

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సం గ్వాన్ ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్)

లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రంలో ఫార్మీన్ బేగం ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసి మార్క్ అవుట్ ఇచ్చి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లబ్ధిదారులకు మంజూరైన ఇండ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకోవాలని, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందని, కానీ రవాణా, లేబర్ ఖర్చులు లబ్ధిదారులు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. బేస్మెంట్ వరకు నిర్మించుకున్న వారికిన్లక్ రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, దశల వారీగా నిర్మాణాలను బట్టి , పూర్తయిన ఇండ్లకు మొత్తం 5 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారి విజయ్ పాల్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, ఎంపీడీఓ నరేష్, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న శానిటేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. వర్షకాలం ప్రారంభానికి ముందే మురికిం కాలువల లోని చెత్తను తొలగించాలని, వర్షం నీటికి అడ్డుగా ఉండకుండా సరిచేయాలని తెలిపారు. ప్రతీ శుక్రవారం డ్రై డే ఫ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళీ, ఎంపీడీఓ నరేష్, పంచాయతీ కార్యదర్శి, తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!