ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బిబిపేటలో మోడల్ ఇందిరమ్మ ఇల్లు ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నా…

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బిబిపేటలో మోడల్ ఇందిరమ్మ ఇల్లు ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నా…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా వివిపేట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం పక్కన ఇందిరమ్మ ఇల్లు నమూనా నిర్మాణం పూర్తి చేసిన ప్రోటోకాల్ ప్రకారం వచ్చి ప్రారంభోత్సవం చేయాల్సి ఉండగా ప్రారంభించకుండా కాంగ్రెస్ నాయకులపై విమర్శించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజులు అన్నారు. శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు నమూనా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకట రమణారెడ్డికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు నమూనా నిర్మాణానికి ప్రారంభించాల్సిన ఎమ్మెల్యే సమాచారం ఉన్న రాకపోవడంతో పాటు నాయకుల పై విమర్శలు చేయడం సరికాదని, అభివృద్ధిని మరింత వెనుకబాటుకు పాల్పడవద్దని అన్నారు. బీబీ పేటలో అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ఒకటేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చేనెల 5వ తేదీన గాంధీ చౌరస్తా దగ్గర మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భూమా గౌడ్, సలీం, మాజీ ఎంపిటిసి మేధర సత్తయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ వెంకట్, పరకాల రవి, మాజీ సర్పంచ్ వెంకటి, నాగరాజ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!