14 పంటలకు కనీస మద్దతు ధర పెంచడంపై మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…

14 పంటలకు కనీస మద్దతు ధర పెంచడంపై మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్)

భారతీయ జనతా కిసాన్ మోర్చా కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 14 పంటలకు ఎం ఎస్ పి (కనీస మద్దతు ధర) పెంచి రైతులకు సంతోషాన్ని తెచ్చిన ప్రధాని మోదీ చిత్ర పటానికి కామారెడ్డి జిలా కేంద్రంలోనీ నిజాం సాగర్ చౌరస్తా లో పాలాభిషేకం శుక్రవారం నిర్వహించారు

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ రైతన్నల సంక్షేమం కోసం మన మోదీ గారు చేస్తున్న మంచికై చేస్తున్న నరేంద్ర మోదీ గారికి మద్దతుగా నేడు కిసాన్ మోర్చా నాయకులు పాలాభిషేకం చేయటం జరిగింది అని, అన్నదాతలకు అండదండగా నిలుస్తున్న నరేంద్ర మోదీ కి సదా, సర్వదా రుణపడి ఉంటామని అన్నారు. అన్నదాతకు మోదీ మద్దతు 14 ఖరీఫ్ పంటలకు ధర పెంపు చేసిందని, వరి మద్దతు ధర పెంపుతో క్వింటాకు రూ.2,369 అయిందని అన్నారు. ఒక వైపు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం జిలుగులు, జనుము సబ్సిడీ విత్తనాలపై రెట్టింపు చేసి రైతులపై కక్ష సాధింపు చేస్తుందని అన్నారు.

 

అంతే కాకుండా ఎంఎస్పీకై రూ. 2.70 లక్షల కోట్ల కేటాయింపు హర్షణీయం అని అన్నారు. రైతులకు వడ్డీ రాయితీకై రూ. 15,642 కోట్ల నిధులు, పెట్టుబడిపై రైతులకు 50% లాభం ఉండేలా నిర్ణయం మోది ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి తెలియజేస్తుందని అన్నారు.

గతేడాదితో పోలిస్తే ఎంఎస్పీ పెరిగిన పంటలు వరి సాధారణ, గ్రేడ్-ఏ కి క్వింటాలు రూ.69 పెంపు, జొన్నలు క్వింటా రూ. 328 పెంపు, సజ్జలు క్వింటా రూ.150 పెంపు, రాగులు క్వింటా రూ.596 పెంపు, మొక్కజొన్న క్వింటా రూ.175 పెంపు, కందిపప్పు క్వింటా రూ.450 పెంపు, పెసర్లు క్వింటా రూ.86పెంపు, మినుములు క్వింటా రూ.400 పెంపు, వేరుసెనగ క్వింటా రూ.480 పెంపు, పొద్దుతిరుగు క్వింటా రూ.441 పెంపు, సోయాబీన్ క్వింటా రూ.436 పెంపు, కుసుములు క్వింటా రూ.579 పెంపు, ఒలిసెలు క్వింటా రూ.820 పెంపు పత్తి క్వింటా రూ.589 పెంపు జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, కిసాన్ మోర్చా నాయకులు గంగారెడ్డి, ఆనంద్ రావు, లింగారావు రాజు, జైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, వీరేశం రైతులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!