రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అంకంరెడ్డి బుల్లిబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రేషన్ దుకాణాలలో బియ్యం పంపిణీ కార్యక్రమం తెలుగు దేశం పార్టీ మండల యువనాయకులు అంకం రెడ్డి బుల్లి బాబు అధ్వర్యంలో చేపట్టారు. ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి వర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ మరియు తుని నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో రేషన్ డిపో వద్ద రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ విధంగా పంపిణీ చేపట్టడం ద్వారా అవినీతి కి తావుండదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు, చింతకాయల కొండబాబు, చింతకాయల సురేష్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు , రేషన్ డీలర్లు పాల్గొనడం జరిగింది