కర్నూలు అఖండ భూమి వెబ్ న్యూస్ :
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు లోకేశ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయన్ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తమది సీఎం జగన్ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం స్పష్టం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టు బెంచ్ హామీపై లోకేశ్‌కు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



